అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో రెవెన్యూ డివిజనల్ స్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని విద్యార్థులు యువజన సర్వీసుల శాఖ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాటికలు, పాటలు వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో పోటీ చేయడానికి అర్హులు అవుతారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి.