అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నిత్యవసరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం భగవన్ సత్యసాయి సేవా సమితి, ఆశ్రయ స్వచ్చంద సంస్థ, దళిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. జోగినీలకు నిత్యవసరాలతో పాటుగా చీరలను కలెక్టర్ గంధం చంద్రుడు పంపిణి చేశారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని కలెక్టర్ అన్నారు. హాజరైన జోగినీలు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. రోడ్లపై మాస్కులు లేకుండా తిరిగే వారు వీరిని చూసి నేర్చుకోవాలన్నారు.
ఇవీ చదవండి