Protest of all Party Leaders in Anantapur: దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఏపీలో మాత్రం చీకటి జీవోలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన దుస్థితి వచ్చిందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీవో నెంబర్ 1కు వ్యతిరేకంగా అనంతపురంలో అఖిలపక్ష నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన సాగుతోందని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా జీవోలను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇప్పటికే ఈ జీవోను కొట్టివేసిందని.. తీర్పు కూడా మాకు అనుకూలంగా వస్తుందని రామకృష్ణ అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు కూడా తడుతామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను అడుగు ముందుకు వేయనివ్వకుండా తీసుకొచ్చిన జీవోను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
దేశమంతా గణతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే..ఏపీలో మాత్రం చీకటి జీవోలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది.. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా జీఓలను తీసుకొచ్చారు. జీఓ నెంబర్ 1ను బేషరుతుగా ఉపసంహరించుకోవాలి. -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: