ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పోలీసుస్టేషన్‌ను ఫిర్యాదులు ఇచ్చేందుకు, తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చే మహిళలకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 967 పోలీసుస్టేషన్లలో పనిచేసే పోలీసు సిబ్బంది, మహిళా కుటుంబ సభ్యులతో దృశ్య శ్రవణ సమావేశం ద్వారా మాట్లాడారు. మహిళల పట్ల గౌరవంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా సిబ్బంది ఆలోచన విధానంలో మార్పులు తీసుకొస్తామని డీజీపీ చెప్పారు. స్టేషన్‌కు వచ్చే మహిళలను సిబ్బంది... మీరు, అమ్మ, తల్లి, చెల్లి అంటూ సంభోదించేలా చూస్తామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో మహిళా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని... మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేలా ప్రొత్సహిస్తామన్నారు. పోలీసుస్టేషన్ల పనితీరు వివరించేందుకు ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి శిక్షలు పడేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాల కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. దిశ యాప్ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బందితో డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళలతో మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకున్నారు. దిశ చట్టం గురించి అందరికీ అవగాహన కల్పించాలని వారిని కోరారు. మహిళల సమస్యలను తెలపాలని...దిశ చట్టం ద్వారా వారికి న్యాయం చేస్తామని అన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం సీఐ సురేష్ బాబు దిశ చట్ట ప్రయోజనాల గురించి వివరించారు.
ఇదీచూడండి. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీపీ