అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అటవీ ప్రాంత పరిధిలో పని చేసే కూలీలు అటవీ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. చెట్లు నాటేందుకు గుంతలు తీశామని.. ఆ కూలీ డబ్బుల ఇంకా ఇవ్వలేదని 60 మందికి పైగా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండాపోయిందని... అందుకే నిరసన తెలుపుతున్నట్లు కూలీలు తెలిపారు. కార్యాలయంలో విధుల్లో ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మొత్తం అందించాలని వారు డిమాండ్ చేశారు.
అయితే అటవీ శాఖలో పనిచేసే ఉద్యోగి కాంట్రాక్ట్ తీసుకొని కూలీలను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ శాఖ అధికారి రామ్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి లెక్కల్లోనే పడకలు.. చిక్కుల్లో రోగులు!