ETV Bharat / state

'తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' - demanding for Sacked workers to must be on duty

కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. తొలగింపును నిరసిస్తూ ఉరవకొండ పట్టణంలో సచివాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.

ananthapuram district
తొలగించిన కార్మికులను విధులలోకి తీసుకోవాలి
author img

By

Published : Jun 22, 2020, 5:43 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికులను తొలగించారని, వారిని విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. ఉరవకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితో ఉరవకొండ, కూడేరు వాటర్ స్కింలలో పని చేస్తున్న ఆరుగురిని తొలగించారని.. , గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగా జరిగాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులు ఆరోపించారు. కార్మికులు పోరాడి ఉద్యమాలు చేసినప్పుడు తిరిగి పనిలోనికి తీసుకున్నారని.. ఏ కారణం లేకుండానే విధులకు రావద్దని అనటం ఏంటని ఆయన ప్రశ్నించారు.

అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ వాగ్దానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది చదవండి రాష్ట్రంలో మరో 443 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.