అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చౌక ధాన్యపు డీలర్ ఎర్రి స్వామి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలంలోని గుడిసెలో ఆత్మహత్యకు పాల్పడిన ఎర్రిస్వామి మెడలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఉండటంతో ఆ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఎర్రిస్వామి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని, హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: జూనియర్ ఆర్టిస్టుపై హత్యాయత్నం?