ETV Bharat / state

బొమ్మల కొలువు... సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు - culture special bommala koluvu in ananathapuram

దసరా... అంటే మనకు గుర్తొచ్చేది నవరాత్రులు.. బొమ్మల కొలువులు.. సాంప్రదాయ వంటలు. ప్రస్తుతం నగర జీవన విధానంలో క్షణం తీరిక లేకుండా ఉన్నవారికి బొమ్మల కొలువు అంటే ఏదో కొత్త మాట విన్నట్లుగా అనిపిస్తుంది. ఓ కుటుంబం మాత్రం 30 ఏళ్లుగా ఏటా విజయదశమి రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తోంది. పురాణ గాథలు, దేవతల విశిష్టత, మానవ జీవన పరిస్థితులు తెలియజేసేలా ఈ బొమ్మల కొలువు ఉంటుంది.

బొమ్మల కొలువు
author img

By

Published : Oct 8, 2019, 7:35 PM IST

బొమ్మల కొలువు... సంస్కృతి సంప్రదాయాల నెలవు

అనంతపురంలోని ఆర్కేనగర్​కు చెందిన కమలాకర్, మల్లిక కుటుంబం దసరా వచ్చిందంటే తమ నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. అందరిలా ఏదో ఒకలా బొమ్మలు ఒకచోట పెట్టరండీ వీళ్లు. సమాజానికి ఉపయోగపడేలా వినూత్నంగా ఆలోచించి కొలువు తీర్చిదిద్దుతారు. నైతిక విలువలు పెంపొందించేలా... దేవతల జీవిత కథలతో కూడిన విగ్రహాలు, తల్లిదండ్రులపై గౌరవం పెంపొందించే బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి. తమ ఇంటికి వచ్చే చిన్నారులకు దేవుళ్ల విశిష్టత తెలియచెప్పి వారిలో ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తారు.

సంప్రదాయానికే పెద్దపీట
కమలాకర్, మల్లిక దంపతులకు ఏ ప్రదేశానికి వెళ్ళినా సంప్రదాయ విలువలు చాటే బొమ్మలు కొనడం అలవాటు. అమెరికా, చెన్నై, పాండిచ్చేరి, కొండపల్లి, హైదరాబాద్ ఇలా వివిధ ప్రాంతాల నుంచి ప్రతిమలు కొని ఈ వేడుక చేస్తారు.

పురాణ గాథలన్నీ బొమ్మల రూపంలో...
రామాయణ, మహాభారతంలోని కీలక ఘట్టాలను బొమ్మల రూపంలో చక్కగా వివరించారు. శ్రీ రామ జననం, సీతా స్వయంవరం, సీతాపహరణ, జటాయుమరణం, రావణాసురుని సంహారం, శ్రీ కృష్ణుని లీలలకు సంబంధించిన కళీయమర్థనంకు సంబంధించి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గజేంద్ర మోక్షం, శ్రీ లలితాదేవి వైభవం, సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన బొమ్మలు ఒకేచోట చేర్చారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ బొమ్మల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కొత్త తరానికి తెలియచెప్పాలనే వీటిని నిర్వహిస్తున్నట్లు ఆనందంగా చెబుతున్నారా దంపతులు.

అభినందనీయం
కమలాకర్​, మల్లిక దంపతులు ప్రయత్నాన్ని చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. తమ పిల్లలకు పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాలు, దేవతల విశిష్టతలు చక్కగా తెలుస్తున్నాయని చెబుతున్నారు. పండుగలను ఏదో యాంత్రికంగా కాకుండా వాటిలో అంతరార్థాన్ని పది మందికీ తెలియచెప్పేలా ఎన్నో ఏళ్లుగా ఈ దంపతులు చేస్తోన్న కృషి నిజంగా ఆదర్శనీయం.

ఇదీ చూడండి:

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

Intro:పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవర్గ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆచంట పరిశుద్ధ రామేశ్వర స్వామి ఆలయంలో పార్వతి అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా చండీ హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదమల్లం లోని ప్రసిద్ధ మాచేనమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి కి ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు.

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.