అనంతపురం జిల్లా ముదిగుబ్బ పాత ఊరు పెద్దమ్మ ఆలయం వద్ద సంతలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. రాజు అనే యువకుడు మృతిచెందాడు. మృతుడు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. అంగట్లో బిస్కెట్ల సంచి తీసుకుని ఓ కోతి... సమీపంలోని రేకుల షెడ్డు ఎక్కింది. అక్కడికి వెళ్ళిన రాజు కోతిని అదిలించే ప్రయత్నంలో.. పైన ఉన్న 11 కీవీ విద్యుత్ తీగలను తాకాడు. ఆ వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి