అనంతపురం జిల్లా కదిరిలో ఒక వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. ఈ విషయం ప్రజలకు తెలిసింది. ఆ నోటా ఈ నోటా ఊరంతా విషయం పాకింది. కదిరిని రెడ్ జోన్ గా ప్రకటిస్తారనే అనుమానాలు అంతటా వ్యక్తమయ్యాయి. అంతే.. జనాలు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చారు.
కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం వీధుల్లో ఎగబడ్డారు. మార్కెట్ తో పాటు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. బుధవారం నుంచి రెండు వారాల పాటు దుకాణాలన్నీ మూసివేస్తారన్న ప్రచారంతోనే ఇలా రద్దీ ఏర్పడిందని స్థానికులు చెప్పారు.
ఇదీ చదవండి: