నివర్ తుపాను అనంతపురం జిల్లా రైతులను నిండాముంచింది. ఎడతెరిపిలేని వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. కదిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కోత దశలో ఉన్న వరిపంట పూర్తిగా దెబ్బతింది. దాదాపుగా 427.7 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: రెండు వారాల్లో 2 వాయుగుండాలు..!