విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని సీపీఎం నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను మోదీ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమన్న సీఎం జగన్.. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం అధికార, విపక్ష పార్టీలు కృషి చేయాలని కోరారు. ఆనాడు ఇచ్చిన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలంటూ ధర్నా