సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. రాస్తారోకోలో పాల్గొన్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా కార్ల తయారీ పరిశ్రమను రామకృష్ణ సందర్శించగా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చూడండి...