కార్పోరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని... తోడుగా రాష్ట్రంలో ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ... అనంతపురంలో 3 రోజులుగా వామపక్షాలు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.
అదానీ, రిలయన్స్, మరి కొన్ని వ్యాపార వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి బిల్లులను తీసుకొచ్చారని నారాయణ ఆరోపించారు. ఈ చర్యకు సీఎం జగన్ మద్దతు ఇవ్వడం ఏంటన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సైతం మోదీ ఏం చేసినా మద్దతు పలుకుతున్నారని ఆగ్రహించారు. ప్రజలే వీరిని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: