బహుళ అంతస్తుల్లోని నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని నినాదాలు చేస్తూ... సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గత ప్రభుత్వం స్థానిక హిందూపురం రోడ్లో సుమారు 2500 నివాసాలతో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారని నాయకులు అన్నారు. ఇందులో 90 శాతం పైగా నిర్మాణాలు పూర్తి అయిన నివాసాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్లు నిరుపయోగంగా మారకుండా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బహుళ అంతస్తుల్లోని నివాసాలను అర్హులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 2న మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి తామే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వేమయ్య యాదవ్ అన్నారు.
ఇదీ చదవండీ...విశాఖ మెట్రోకు వచ్చే నెలలో టెండర్లు:బొత్స