మూడు సెంట్ల స్థలాన్ని అర్హులందరికి కేటాయించాలని సీపీఐ అధ్వర్యంలో అనంతపురం జిల్లాలో నిరసన చేశారు. శింగనమల మండల వ్యాప్తంగా పేదలకు ఇంటి స్థలాలు గత నాలుగు నెలలుగా ఒక్కొకరికి ఓకటిన్నర సెంటు ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప అచరణలో మాత్రం అమలు కావడంలేదని సీపీఐ మండల కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సెంటున్నర స్థలం ఇస్తామని ప్రకటించడం సరైంది కాదని పేర్కొన్నారు. అందరికీ 3సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే పక్కా గృహలను కట్టించాలని సీపీఐ డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి