పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఏడాదిన్నర కిందట ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు భూమి ఇస్తే ఒక్కో కుటుంబానికి ఏ విధంగా సరిపోతుందని మండల కార్యదర్శి చిన్నప్ప ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ విశ్వనాథ్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: