పెంచిన విద్యుత్ ధరలను నిరసిస్తూ... అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వామపక్ష నాయకులు నిరసన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీలు అధికంగా వసూలు చేస్తూ పేదలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీపీఐ నాయకుడు సంజీవప్ప మండిపడ్డారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి విద్యుత్ వినియోగదారులను మోసానికి గురి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: