కొవిడ్ బాధితులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ.. రోగుల బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఈ ఘటన జరిగింది.
ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేవని.. సహాయకులను లోపలికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి :