ETV Bharat / state

కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో తీవ్ర జాప్యం.. ఆందోళనలో ప్రజలు - corona test late in ananthapur

కరోనా వ్యాప్తిని అరికట్టే ప్రధాన చర్యల్లో టెస్టింగ్‌ ఒకటి. ఇందుకోసం టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచి.. 24 గంటల్లో ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అనంతపురం జిల్లాలో పరిస్థతి దీనికి భిన్నంగా ఉంది.

corona test results being late in ananthapur

author img

By

Published : May 1, 2021, 8:16 AM IST

అనంతపురంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో తీవ్ర జాప్యం

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆ క్రమంలో తగ్గట్టు పరీక్షలు నిర్వహించడం లేదు. కొవిడ్‌ పరీక్షల ఫలితాల వెల్లడిలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఫలితం ఆలస్యం కావడం వల్ల వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫలితాలు రావడానికి 3 నుంచి 7 రోజులు పడుతోందని చెబుతున్నారు.

ఒక్కటే ల్యాబ్​..

అనంతపురం జిల్లా మొత్తానికి కలిపి.. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్‌ ఉంది. దీంతో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఇక్కడికే తరలించాల్సి వస్తుంది. నమూనాల ఫలితాలు వెల్లడించేందుకు సిబ్బంది 3 షిప్టుల్లో పనిచేస్తున్నారు.

సర్వర్ల మొరాయింపు..

కరోనా పరీక్షలు చేయించుకోవడానికి అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి వచ్చిన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ సర్వర్‌ మొరాయిస్తుండటంతో శాంపిల్‌ ఐడీలు జనరేట్‌ చేయడం సిబ్బందికి కష్టంగా మారుతోంది. పరీక్షల కోసం వచ్చిన బాధితులు భౌతికదూరం పాటించేలా కనీస చర్యలు తీసుకోవడం లేదు. గత 15 రోజులుగా కేసుల తాకిడి అధికంగా ఉండటం వల్ల సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని కరోనా పరీక్షల ఫలితాలు వీలైనంత త్వరగా ఫలితాలు వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.