ETV Bharat / state

కరోనా కాటుకు మరో ఇద్దరు బలి!

కరోనా వైరస్ బారిన పడి రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్క వృద్ధులు మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు.

corona deaths in ap
కరోనా కాటుకు మరో ఇద్దరు బలి?
author img

By

Published : Apr 5, 2020, 7:41 AM IST

కరోనా వైరస్‌ వ్యాధిన పడి మరో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి.. సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 1న శ్వాసకోస సమస్యలతో అతను ఆసుపత్రిలో చేరాడు. కరోనా వ్యాధి సోకిందేమోనన్న అనుమానంతో నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం చనిపోయాడు. సాయంత్రానికి వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. సదరు వ్యక్తి మక్కాకు వెళ్లొచ్చిన ఒకరి బంధువుగా తెలుస్తోంది.

మచిలీపట్నంలో మరొకరు!

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. జ్వరంలో ఏప్రిల్‌ 1న అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా.. అతని నమూనాలను సేకరించారు. ఆయన ఆరోగ్యస్థితి విషమంగా మారటంతో శనివారం విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందతూ కొద్దిసేపటికే అతను మరణించాడు. ఆయనకు మధుమేహం వంటి సమస్యలూ ఉన్నట్లు సమాచారం. రోల్డ్‌గోల్డ్‌ వ్యాపారం నిమిత్తం ఇతను తరచూ... వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం... ఆరు రోజుల్లో 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.