అనంతపురం జిల్లా.. గుంతకల్లులో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుంతకల్లు మీదుగా శ్రామిక రైళ్లు నడపుతుండటంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి వారిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే వారు నివాసం ఉంటున్న ప్రాంతాలను ప్రత్యేక జోన్ గా ప్రకటించి.. చుట్టు పక్కల ప్రజలను హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నామని కమిషనర్ తెలిపారు.
బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవలని సూచించారు. అందరూ మాస్కులు ధరించాలన్నారు. మార్కెట్,షాపింగ్ మాల్స్ కు వెల్లినప్పుడు సామాజిక దూరం పాటించి కొనుగోల్లు చేయాలని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు గుంతకల్లు పట్టణంలో 9 ప్రాంతలలో కరోనా వైరస్ అనుమానితులను గుర్తించారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కరోన సోకిన ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉదయం,సాయంత్రం వేళల్లో హైడ్రో క్లోరిన్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.
ఇదీ చదవండి: తీరు మారని చైనా.. 'గల్వాన్'పై మళ్లీ అదే మాట