అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని రెవెన్యూ పోలీస్ అధికారులు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై.. కరోనా నియంత్రణకు సమాలోచనలు చేశారు.
ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే రోడ్లపైకి రావాలని అధికారులు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ప్రమాదాలు జరుగుతున్నా.. కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోంది'