కరోనాపై అవగాహన కల్పించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కరోనా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వస్త్రదుకాణాల సహకారంతో ఆటోడ్రైవర్లకు ప్రయాణికులకు అడ్డుగా ఉండే తెరలను పంపిణీ చేశారు. ఆటో ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడు మాస్కు ధరించేలా చూడాలని అధికారులు డ్రైవర్లకు సూచించారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీచదవండి