ప్రజలందరూ ఐకమత్యంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కృషి చేయాలని అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన చిత్రకారుడు చక్రి పిలుపునిచ్చారు. ప్రధాన రహదారిపై వైరస్ చిత్రాన్ని గీసి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ చిత్రం గీసేందుకు తానే సొంతంగా రూ.2 వేలు ఖర్చు చేశానని ఆయన పేర్కొన్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డుపైన కనిపించినా కరోనా వైరస్ చిత్రాన్ని చూసిన ప్రజలు బయటకు రాకుండా ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి డ్రోన్ కెమెరా చూసి అక్కడి యువకులు పరుగో పరుగు...