ETV Bharat / state

విద్యార్హత నమోదులో తిరకాసు - ananthapuram newsupdates

అనంతపురం జిల్లాలో కీలకమైన ప్రభుత్వ సర్వజన, ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు చెందిన వైద్య పోస్టుల నియామక వ్యవహారంలో మళ్లీ పొరపాట్లు తలెత్తాయి. కొన్ని కేడర్లకు సంబంధించి విద్యార్హత నమోదులో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Contradiction in education registration
విద్యార్హత నమోదులో తిరకాసు
author img

By

Published : Oct 15, 2020, 12:17 AM IST

అనంతపురం జిల్లాలో కీలకమైన ప్రభుత్వ సర్వజన, ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు చెందిన వైద్య పోస్టుల నియామక వ్యవహారంలో మళ్లీ పొరపాట్లు తలెత్తాయి. కొన్ని కేడర్లకు సంబంధించి విద్యార్హత నమోదులో చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెయిటేజీ నమోదులో కొన్ని కేడర్లకు ఇవ్వకూడదన్న మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదికాస్త వివాదమైంది. సర్వజన, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు చెందిన 26 రకాల కేడర్లకు సంబంధించి జులైలో దరఖాస్తులు స్వీకరించారు. వీటి భర్తీ వ్యవహారంపై దుమారం రేగింది. వెయిటేజీ ఇవ్వకుండా ప్రతిభా జాబితాలను వెల్లడించారు.

స్టాఫ్‌నర్సుకు సంబంధించి నాన్‌ లోకల్‌ వారిని లోకల్‌ కేటగిరీలో పేర్కొన్నారు. ఇలా అనేక అంశాలపై అస్పష్టత, అస్తవ్యస్తంగా మారింది. దీనిపై అప్పట్లోనే ‘ఈనాడు’ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. వీటికి స్పందించిన అధికారులు నిర్దేశిత జాబితాలను రెండోసారి సవరణలతో ప్రకటించారు. అయినా సరే.. మళ్లీ కొన్ని కేడర్లల్లో తప్పులు దొర్లాయి. అదీకాకుండా వందలాది మందికి చెందిన అభ్యర్థుల పేర్లను అనర్హత జాబితాలో చూపించారు. విద్యార్హత, కుల తదితర పత్రాలు జత చేయలేదని చూపారు. చాలామంది సదరు పత్రాలను జత చేసినా అనర్హత కింద పెట్టడంపై పెదవి విరుస్తున్నారు.

‘ప్రైవేట్‌’కూ వెయిటేజీ

ప్రభుత్వ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి స్టాఫ్‌నర్సు పోస్టులకు 2,542 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రథమ ప్రతిభా మార్కులు 84.91 శాతం ఉండగా.. సర్వజనలో అదే మెరిట్‌ 84.04 ప్రకారం ఉంది. ఇక్కడ మాత్రం 2,232 మంది దరఖాస్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు కొందరు అభ్యర్థులకు ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసిన దానికి వెయిటేజీ కలపడం విశేషం. ప్రభుత్వ వైద్య సంస్థల్లో పని చేస్తున్న వారికి మాత్రమే నిర్దేశిత కేడర్లల్లో వెయిటేజీ ఇవ్వాలి. రెండు విభాగాల్లోనూ స్టాఫ్‌నర్సు ప్రతిభ జాబితాలో తొలి 150 మంది దాకా ప్రస్తుతం పని చేస్తున్న వారే ఉండటం ప్రస్తావనార్హం. ఇలా అనేక పొరపాట్లు, తప్పులు దొర్లాయి. వీటిని ఎంపిక జాబితా నాటికి సరిదిద్దుకోవాల్సి ఉంది.

బీఎస్సీనా... ఎమ్మెస్సీనా!

సర్వజనాస్పత్రిలో డైటీషియన్‌ పోస్టు ఒక్కటే ఉంది. దీనికి 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వెయిటేజీ లేకుండా ప్రకటించారు. తాజాగా వెయిటేజీ ఇచ్చారు. ఈ కేడర్‌కు వెయిటేజీ ఇవ్వడానికి లేదని ఓ ఉత్తర్వు తెరపైకి వచ్చింది. బీఎస్సీ కొందరికి.. ఎమ్మెస్సీ విద్యార్హత మరికొందరికి తీసుకుని మార్కులను లెక్కించారు. నోటిఫికేషన్‌లో బీఎస్సీ (ఆహార-పోషణ) డిగ్రీ ఉండాలని పేర్కొన్నారు. ఆ 42 మందిలో 12 మందికి చెందిన విద్యార్హతను బీఎస్సీ నమోదు చేయగా.. తక్కిన వారికి ఎమ్మెస్సీ మార్కులు చూపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల ఎకరాల్లో మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.