ETV Bharat / state

Protest: గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద ఒప్పంద వైద్యులు, ఉద్యోగుల ఆందోళన - అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద ఒప్పంద వైద్యుల నిరసన

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద.. ఒప్పంద వైద్యులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన వారిని.. వేతనాలు చెల్లించకుండా.. ఇప్పుడు ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించటంపై వారు నిరసన చేపట్టారు.

contract based doctors and employees protest at guntakallu in ananthapur
గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద ఒప్పంద వైద్యులు, ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Oct 3, 2021, 4:43 PM IST

గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద ఒప్పంద వైద్యులు, ఉద్యోగుల ఆందోళన

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒప్పంద వైద్యులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో సేవలందించేందుకు.. ఒప్పంద పద్ధతిలో తమను నియమించుకుని.. వేతనాలు చెల్లించకుండా.. ఇప్పుడు ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించటంపై వారు ఆందోళన చేపట్టారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన వారిని.. అర్ధాంతరంగా తొలగిస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒప్పంద ఉద్యోగుల ధర్నాకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. వచ్చే నోటిఫికేషన్‌లో వీరికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని.. లేకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Land Scam: నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూముల కబ్జా.. పోలీసుల అదుపులో నిందితులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.