ETV Bharat / state

ఖాళీల నిలుపుదల.. మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలలు

ఓచేత్తో పోస్టులు కేటాయిస్తూ.. మరో చేత్తో వాటిని నిలుపుదల చేస్తుండటంతో మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరపైకి వచ్చాయి. మరోవైపు కోరుకున్న స్థానాలు దక్కేలా లేవని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క విద్యార్థి ఉన్నా ప్రతి పాఠశాలకు ఇద్దరు గురువులను నియమించాలన్నది నిబంధన. గురువారం బదిలీల సీనియార్టీ జాబితాను ప్రకటించిన తర్వాత కొన్ని పోస్టులను నిలుపుదల (బ్లాక్‌) చేయడంతో పలువురి ఆశలు గల్లంతయ్యాయి.

Confusion in Teachers postings
మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలలు
author img

By

Published : Dec 4, 2020, 2:17 PM IST

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బ తండాలో 12 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు టీచర్లు ఉండాలి. కొన్ని పోస్టులు నిలుపుదల చేయడంతో ఇక్కడ ఒక్కరు మాత్రమే బోధన చేయాల్సి ఉంటుంది.

అగళి మండలం కంబాదహళ్లి ప్రాథమిక పాఠశాలకు ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించారు. ఆయన హాజరు కాలేదంటే పాఠశాల మూతపడాల్సిందే.’

అనంత గ్రామీణం నాగిరెడ్డిపల్లి, ఎం.బండమీదపల్లి ప్రాథమిక పాఠశాలలకు ఏకోపాధ్యాయులను కేటాయించారు.’

బోధనపై ప్రభావం

Confusion in Teachers postings
మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలలు

ఒకే ఉపాధ్యాయుడు ఉంటే విద్యార్థులకు బోధన సక్రమంగా అందడం లేదన్నది అక్షర సత్యం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి పాఠశాలకు ఇద్దరిని నియమించాలని నిర్ణయించింది. కానీ పోస్టులను నిలుపుదల చేసి, కొన్నింటిని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్పు చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి కసరత్తు చేసి, ఖాళీల లెక్క తీసినా ప్రయోజనం లేకుండా పోయిందన్న భావన వ్యక్తమవుతోంది. 10 నుంచి 20మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను పరిగణనలోకి తీసుకుని ఒకరిని కేటాయించారు. గతంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 375 ఉండగా.. తాజా లెక్కల ప్రకారం ఆ సంఖ్య 200 కానుంది. ఉన్నత పాఠశాలల్లో సహాయకులకు సంబంధించి 223 పోస్టులను నిలుపుదల చేయడంతో పదోతరగతి విద్యార్థుల బోధనపై ప్రభావం చూపనుంది.

నచ్చినవారికి కట్టబెట్టేందుకేనా?

ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీఓ ద్వారా పలువురు ఉపాధ్యాయులు దగ్గరి ప్రదేశాల్లో చేరిపోయారు. తాజాగా మరికొన్ని పోస్టులను బ్లాక్‌ చేయడంతో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. తమకు అనుకూలమైన వారికి పోస్టులు కట్టబెట్టేందుకే బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దూరప్రాంత పాఠశాలల్లోని విద్యార్థులకు చక్కటి బోధన అందించాలన్న ఉద్దేశంతో దగ్గరి ప్రదేశాల్లోని ఖాళీలను బ్లాక్‌ చేశామని యంత్రాంగం చెబుతోంది. రవాణా సౌకర్యాలు లేని పాఠశాలలు, జిల్లా కేంద్రం, పట్టణాలకు దూరంగా ఉన్న మండలాలకు ఉపాధ్యాయులు వెళ్లడం లేదన్న ఉద్దేశంతో పోస్టులను నిలుపుదల చేశామని పేర్కొంటున్నారు. అయితే బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొందరు ప్రభుత్వ సిఫార్సులతో దగ్గరి ప్రదేశాల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడనున్నాయి.

అన్ని ప్రాంతాలకు న్యాయం

కమిషనరు ఆదేశాల మేరకు పోస్టులను బ్లాక్‌ చేశాం. తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నవారు పాయింట్ల ప్రకారం వెళ్లాల్సిందే. దూరప్రాంత విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే కొన్ని పోస్టులను నిలుపుదల చేశాం. తక్కువ మంది విద్యార్థులున్న ప్రాంతంలోనే బ్లాక్‌ చేశాం. నిబంధనల ప్రకారమే బదిలీల ప్రక్రియ జరుగుతుంది. - శామ్యూల్‌, డీఈఓ

ఇవీ చూడండి:

ప్రమాదంలో హిందూపురం పట్టు రీలర్ల సంఘం అధ్యక్షుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.