అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి గ్రామంలో గత కొన్నేళ్లుగా తెదేపాకు చెందిన వ్యక్తి చెత్త సేకరణ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వైకాపాకు చెందిన వ్యక్తికి ఆ విధులు అప్పగించాలంటూ తెదేపా, వైకాపా వర్గాల మధ్య వివాదం సాగుతోంది. చెత్తను సేకరించే సైకిల్‌ను వైకాపాకు చెందినవారు తీసుకెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, కొడవళ్లతో దాడులకు దిగడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గ్రామానికి చేరుకొని ఘర్షణకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి..: కోర్టు తీర్పులే లెక్క చేయడు.. ఇంట్లో దీక్షలు చేస్తే ఏం లాభం: జేసీ