అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 42 గంటల పాటు పోలీసులు కర్ఫ్యూ విధించారు. అత్యవసర వైద్య సేవలు, పాలు, పెరుగు, పెట్రోల్ బంకులు మినహా అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
లాక్డౌన్ వల్ల నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ బయటకు రావద్దని ఇళ్లలోనే ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం, కనేకల్, బొమ్మనహల్, డి హిరేహాల్, గుమ్మగట్ట మండలాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ రాజా ఆధ్వర్యంలో దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పొంచి ఉన్న 'యాస్' ముప్పు- అధికారులు అప్రమత్తం
రెమ్డిసివర్ ఇంజక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్