జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని అనంతపురంలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మొలకెత్తిన వేరుశనగ పంటలను చేతబట్టి వినూత్న నిరసన చేపట్టారు. వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు రూ.25 వేలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతుల పట్ల జిల్లా వ్యవసాయ రంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారని ఆరోపించారు. ఇలాంటి కష్ట కాలంలో రైతులకు పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: అనంతలో వర్ష బీభత్సం.. నీట మునిగిన పంట పొలాలు