ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసింది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారని సమాచారం బయటకు వచ్చినా... ఆ సమావేశం జరగలేదు. రాత్రికి జగన్ దిల్లీలోనే బస చేశారు. శుక్రవారం ఉదయం హోంమంత్రి అపాయింట్మెంట్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ లోపే ముఖ్యమంత్రి సహాయకుడు నారాయణ మృతి చెందిన సమాచారాన్ని జగన్‌కు అధికారులు తెలిపారు. పర్యటనను అర్థంతరంగా ముగించుకుని నారాయణ స్వగ్రామమైన అనంతపురం జిల్లా ముదిగబ్బు మండలం దిగువపల్లెకు జగన్ వెళ్లారు. నివాళి అర్పించారు. జగన్ సతీమణి భారతి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఇదీ చూడండి