ETV Bharat / state

రాష్ట్రంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు - christmas celabrations in ananthapur

రాష్ట్రంలో క్రైస్తవులు క్రిస్మస్​ను ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు పునరుత్థాన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

christmas celabrations
రాష్ట్రంలో వైభవంగా క్రిస్మస్
author img

By

Published : Dec 25, 2019, 6:40 PM IST

రాష్ట్రంలో వైభవంగా క్రిస్మస్...

కృష్ణా జిల్లా..
క్రిస్మస్ పర్వదిన వేడుకలు జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు చర్చిల్లో ఘనంగా జరిగాయి. భక్తులంతా చర్చిల్లో ప్రార్థనలు చేశారు. బాలయేసు రాకను ఆహ్వానిస్తూ... ఆర్​సీఎం, సీఎస్ఐ, పెంతెకోస్తు, పెనుగంచిపోలులోనే షాలోమ్, జెజీఎం చర్చిలో ప్రార్థనలు చేశారు.

అనంతపురం జిల్లా..
జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్​ ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రాంగణంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. మతపెద్దలు ప్రార్థనలు చేశారు. సప్తగిరి సర్కిల్ ప్రధాన సీఎస్ఐ చర్చిలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తులకు, పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాజంలో బైబిల్, ఖురాన్, భగవద్గీత మూడు తెలిపేవి ఒక్కటే అని... మనుషులను ప్రేమించాలని అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెప్పారు.

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 58 దేశాలకు చెందిన వేలాది మంది భక్తుల నడుమ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సాయికుల్వంత్ మందిరంలో క్రిస్మస్ వేడుకలను అంతర్జాతీయ క్రిస్మస్ కోఆర్డినేటర్ టామ్ ప్.జాన్ హనర్, క్యాండీల్స్ వెలిగించి ప్రారంభించారు. సాయి విద్యార్థులు, విదేశీ భక్తులు సంయుక్తంగా గీతాలను ఆలపించారు. విద్యుత్ కాంతులతో ప్రశాంతి నిలయం నూతనశోభను సంతరించుకుంది.

కడప జిల్లా..
లోక రక్షకుడు యేసుప్రభు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రాత్రి నుంచి ఉదయం వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో దేవుని పాటలు ఆలపించారు. కడప సీఎస్ఐ ఫాదర్ మత్తయ్య బాబు క్రీస్తు జననం గురించి ప్రసంగించారు.

తూర్పుగోదావరి జిల్లా...
జిల్లాలోని పి. గన్నవరం నియోజకవర్గంలో క్రిస్మస్​ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు.. ఆటపాటలతో అలరించారు. క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు జరిపారు. పి గన్నవరం, అంబాజీపేట అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని చర్చిల వద్ద క్రిస్మస్ వేడుకలు జరిగాయి.

విశాఖ జిల్లా...
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అన్ని క్రైస్తవ మందిరాల్లో మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 110 సంవత్సరాల చరిత్ర గల యలమంచిలి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా యువకులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రార్థనల అనంతరం పేదలకు వస్త్రదానం చేశారు.

ఇదీచూడండి.సీఎం జగన్ ఆలోచన మారాలని ప్రార్థించా: నారా లోకేశ్

Intro:ఘనంగా క్రిస్మస్ వేడుకలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సి ఎస్ ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రాంగణం అంతా విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్లు పెద్ద ఎత్తున హాజరై ప్రభువును దర్శించుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.