గుంతకల్లు పట్టణానికి చెందిన ఓ బాలిక మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బయటకు వెళ్లిపోయింది. ఇంటికొచ్చిన తల్లి బాలిక కోసం చుట్టు పక్కల అంతా గాలించింది. ఆచూకీ లభించకపోవడంతో స్థానికులు సహాయంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డికి సమాచారం అందించారు. డీఎస్పీ నేతృత్వంలో జిల్లా ఎస్పీ సత్య యేసు బాబు ఆదేశాల మేరకు పోలీసులు చుట్టుపక్కల స్టేషన్లకు సమాచారం అందించారు. 8 బృందాలుగా విడిపోయి పట్టణం అంతా గాలించారు. 2 గంటల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్నారు. గుంతకల్లులోని చర్చి వద్ద బాలిక ఆచూకీ లభ్యమైంది.
ఈ సంఘటనతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించి ఇంటి నుంచి వెళ్లిన కారణాలను అడగగా కొత్త డ్రెస్ కొనివ్వలేదని.. ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలిపింది. పోలీసులే బాలల దినోత్సవం సందర్భంగా కొత్త బట్టలు కొనిపెట్టి బాలికను తల్లికి అప్పగించి పెద్ద మనసును చాటుకున్నారు. పోలీసులు 2 గంటల్లోనే సహకరించి తమకు అప్పగించినందుకు తల్లి సంతోషం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి