అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లను తొలగించారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. పరిపాలనలో చంద్రబాబు దార్శనికుడు అయితే... ఆర్థిక నేరాల్లో ముఖ్యమంత్రి జగన్ అగ్రగణ్యుడని విమర్శించారు. పేదల పొట్టలు కొట్టడానికి జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగే పరిస్థితి లేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి కోపం వస్తే.. జగన్కు బేడీలు ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించే వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: