చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన.. అనంతపురం జిల్లాలో జరిగింది. రొద్దం మండలం బొక్కసంపల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని.. బొక్కసంపల్లె వాసులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. రక్షణ చర్యల్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక చిరుత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం చిరుత మృతదేహాన్ని.. పెనుకొండ పశు వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:
Jagananna Paccha Thoranam: జగనన్న పచ్చతోరణం..ఈ ఏడాది లక్ష్యం 68 లక్షల మొక్కలు