ETV Bharat / state

ప్రజల్లో జగన్​పై అసహ్యం మొదలైంది.. అందుకే పరదాలు కట్టుకుని పర్యటనలు: చంద్రబాబు

CBN FIRES ON CM JAGAN : ముఖ్యమంత్రి జగన్​పై ప్రజల్లో అసహ్యం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడిపత్రి కౌన్సిలర్లతో సమావేశమైన చంద్రబాబు.. అక్కడి డీఎస్పీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన చేస్తుండటం సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు.

cbn meeting with tadipatri councilors
cbn meeting with tadipatri councilors
author img

By

Published : Nov 25, 2022, 7:55 PM IST

CBN FIRES ON CM JAGAN IN COUNCILORS MEETING : జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో అసహ్యం ప్రారంభమైందని.. ఆ భయంతోనే పరదాల కట్టుకుని సీఎం పర్యటనలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం సభలకు బలవంతంగా ప్రజల్ని కూర్చోపెడుతున్నా.. గోడలు దూకి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడిపత్రి కౌన్సిలర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని.. మరో 3జిల్లాలు తిరిగితే ఆ పార్టీ మొత్తం బిస్తర సర్దేస్తారని ఎద్దేవా చేశారు.

రాక్షసుడు సీఎం అయి ఉన్మాద పాలన సాగిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ప్రజా సేవకుడిగా కాకుండా ఓ డిక్టేటర్​లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన చేస్తుండటం సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. తాడిపత్రి కౌన్సిల్ మీటింగ్ పోలీస్ స్టేషన్​లో పెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్​పై ప్రజల్లో అసహ్యం మొదలైంది.. అందుకే పరదాలు కట్టుకుని పర్యటనలు

"సీఎం సభలకు ప్రజలను బలవంతంగా రప్పించినా గోడలు దూకి పారిపోతున్నారు. కర్నూలు వెళ్లి వస్తే వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయి. తాడిపత్రి డీఎస్పీ నియంతలా వ్యవహరిస్తున్నారు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన మంచిది కాదు. తాడిపత్రి కౌన్సిల్ మీటింగ్ పీఎస్‌లో పెట్టుకునే దుస్థితి వచ్చింది. నిబంధనలు అతిక్రమించిన పోలీసుల వివరాలు తయారు చేస్తున్నాం"-చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవాళ టీడీపీ కౌన్సిలర్లు ఎంతగా బాధపడ్డారో.. అంతకంటే ఎక్కువగా ఆ డీఎస్పీ బాధపడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ఏ రోజైనా చట్టానికి లొంగి శిక్ష అనుభవించక తప్పదన్నారు. నిబంధనలు అతిక్రమించే పోలీసు అధికారుల సాక్ష్యాలు ఇప్పటికే తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే మహిళలు సైతం తెగువ చూపటం అభినందనీయమన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.