అనంతపురం జిల్లా మడినేహళ్లి గ్రామ సమీపంలోని బళ్లారి-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకలోని బుడేనాహళ్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను బళ్లారి విజయనగరం మెడికల్ సైన్సెస్ ప్రధాన వైద్యశాలకు పోలీసులు తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి-కారు ప్రమాదం: 'తెల్లారి'పోయిన తండ్రీకొడుకుల జీవితాలు