అనంతపురం జిల్లా బత్తలపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బత్తలపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన పోలవరపు శ్రీనివాసులు, లక్ష్మన్నలు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష్మన్న తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: