గుంటూరులో..
యూపీలో ఎస్సీ మహిళపై జరిగిన ఘటనను నిరసిస్తూ గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. బీ. ఆర్. స్టేడియం నుంచి పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కూడలి వరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. . నిర్భయ ఘటనలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. యూపీలో ఎస్సీ యువతిపైన ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన మహిళ చివరి చూపు కూడా వారి కుటుంబ సభ్యులకు లేకుండా చేశారని ఆవేదన చెందారు. కేసును తప్పుదారి పట్టించేలా యూపీ పోలీస్ వ్యవస్థ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
అనంతపురం జిల్లాలో..
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్లో హాథ్రాస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హాథ్రాస్లో అత్యాచారం జరిగిన మహిళ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అత్యాచారం చేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :