వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన హరి (28) అనే యువకుడికి బెంగళూరుకు చెందిన ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. వధువును కలిసేందుకు అతడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైలులో ప్రయాణమయ్యాడు.
కానీ సదరు వధువు తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని.. వివాహం రద్దయిందని తెలుసుకుని మార్గ మధ్యలో కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్ స్టేషన్ వద్ద రైలు నుంచి దిగిపోయాడు. మనస్థాపానికి గురైన హరి అక్కడే పట్టాలపై వస్తున్న ఒక రైలుకు ఎదురుగా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబల్లాపూర్ రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: