అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం సాయంత్రం నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి ఊరేగించారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాదికారి శ్రీకరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి శ్రీకల్యాణి స్వామి సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏడాదిలోగా బీటీపీ కాలువ పనులు పూర్తి: ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్