వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణుల అభినందన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 100 కోట్లు కేటాయించామని, ప్రభుత్వం బ్రాహ్మణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. 50 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైకాపా బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పాటు ఇస్తోందని తెలిపారు. సభ అనంతరం ఉపసభాపతిని బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు.
ఇది చూడండి: 'బుజ్జగింపు రాజకీయాల వల్లే ముమ్మారు కొనసాగింది'