ETV Bharat / state

చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం... ఖండించిన భాజపా - bjp Condemned attacks on hindu temples news

అనంతపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం దుండగులు ధ్వంసం చేయటాన్ని భాజపా ఖండించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో గుడి వద్ద నిరసన చేపట్టారు.

bjp protest
భాజపా నిరసన కార్యక్రమం
author img

By

Published : Dec 18, 2020, 5:45 PM IST

హిందూ సమాజం, దేవాలయాలపై వైకాపా ప్రభుత్వం ప్రేరేపిత దాడులకు పాల్పడుతోందని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో పురాతన ఆలయమైన చెన్నకేశవ స్వామి గుడి గోపురాన్ని దుండగులు ధ్వంసం చేయాటాన్ని ఖండిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కేవలం ఒక మతం అభివృద్ధి చెందే దిశగా ఈ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఈ ఘటనలకు సంబంధించి ప్రజల్లో భాజాపా చైతన్యం కల్పిస్తుందని స్పష్టం చేశారు. రానున్న కాలంలో వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.