రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన ఇసుక పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. భాజపా ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ వద్ద ధర్నా చేపట్టారు. వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలు ఎక్కువయ్యాని భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆరోపించారు. ఇసుక ప్రైవేటీకరణను విరమించుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
హిందూపురంలో భాజపా నేతలు ఇసుక ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ తీశారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలింపును అరికట్టాలని.. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఇసుక టెండర్లను వెంటనే రద్దు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.
నర్సీపట్నం..
నూతన ఇసుక విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భాజపా నేతలు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చౌకగా లభ్యమయ్యే ఇసుకను వ్యాపార ధోరణితో విక్రయించడం సమంజసం కాదన్నారు. అనతరం నూతన ఇసుక విధానాని రద్దు చేయాలని కోరుతూ.. సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
నెల్లూరులో..
ఇసుకను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానాన్ని మానుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరులో పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆదాయం చేకూరే మార్గాలను అధికార పార్టీ.. తమకు అనుకూలంగా ఉండే వారికే అప్పగిస్తోందని భాజపా నెల్లూరు పార్లమెంటరీ స్థాయి అధ్యక్షుడు భరత్ కుమార్ విమర్శించారు. ఇతరు ఇసుక టెండర్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. తక్షణమే నూతన ఇసుక విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం