Nominated Posts for Those who Worked Hard for TDP: కూటమి శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నామినేటెడ్ పదవుల రెండో జాబితా రానే వచ్చింది. ఒకేసారి 59 మందికి పదవులను కేటాయించారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ అరాచక పాలనలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి, ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడి నిలబడిన వారికి ఈ జాబితాలో స్థానం దక్కింది.
మంజులా రెడ్డి అలుపెరుగని పోరాటం: పార్టీ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడే క్షేత్ర స్థాయి కార్యకర్తలను టీడీపీ గుండెల్లో పెట్టుకుంటుందనడానికి నిదర్శనం మంజులా రెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజున మంజులా రెడ్డి పోరాటం రాష్ట్రమంతా చూసింది. మాచర్ల పోలింగ్ బూత్‌కు ఏజెంట్‌గా వెళ్తున్న మంజులా రెడ్డిని పిన్నెలి ముఠా దారికాచి కత్తులతో విచక్షణారహితంగా వేటు వేసినా పార్టీకోసం తలకు కట్టుకట్టుమని మరీ బూత్‌ను కాపాడుకుంది. ఆ రోజు ఆమె చూపిన తెగువ చంద్రబాబు, లోకేశ్‌ని ఆకర్షించింది. ఫలితంగా నేడు ఆమెకు శిల్పారామం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సాంస్కృతిక సొసైటి ఛైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు.
శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కమిటీలో పవన్- ఇక్కడి రోప్‌వే జర్ని మధురానుభూతినిస్తుంది: సీఎం
పొడపాటి తేజస్విని అవిశ్రాంత పోరాటం: చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారంటూ ఐటీ ఉద్యోగులందరినీ ఏకం చేసి వివిధ వేదికలపై పొడపాటి తేజస్విని అవిశ్రాంత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఈమెకు సాంస్కృతిక కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.
ఎంఏ షరీఫ్: గతంలో శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో 3 రాజధానుల బిల్లును అనైతికంగా ఆమోదించాలంటూ గత జగన్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చింది. మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగి బూతులు తిట్టినా విధి నిర్వహణలో ఎక్కడా తలొగ్గకుండా వ్యవహరించిన ఎంఏ షరీఫ్‌కు ముస్లిం మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ పదవి దక్కింది.
గోనుగుంట్ల కోటేశ్వరరావు: టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా తనకున్న శారీరక ఇబ్బందులు సైతం లెక్క చేయకుండా ముందుండి మిగతా కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తారు గోనుగుంట్ల కోటేశ్వరరావు. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత వాహన శ్రేణికి పైలట్‌గా స్కూటర్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈయనకు ఏపీ గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ పదవి దక్కింది.
ప్రపంచంలో ఎక్కడచూసినా మనవాళ్లే - అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి: చంద్రబాబు
మాటల తూటాలతో అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి: గత 5ఏళ్ల ప్రతిపక్షంలో మాటల తూటాలతో అధికారపార్టీని కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకట రమణా రెడ్డి, జీవీ రెడ్డిలు ఉక్కిరిబిక్కిరి చేశారు. కొమ్మారెడ్డి పట్టాభిపై ఏకంగా మూడు సార్లు దాడి జరగటంతో పాటు ఓసారి జైలుకు కూడా వెళ్లి పోలీస్ టార్చర్ అనుభవించారు. ఈ క్రమంలో ఆయనను కీలకమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్‌గా పట్టాభిని నియమించారు.
జనవాణిని టీడీపీ గొంతుకగా వినిపించి అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేశారు ఆనం వెంకటరమణారెడ్డి. ఈయనకు ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి లభించింది. పార్టీ అధికార ప్రతినిధులుగా వ్యవహరించిన నీలాయ పాలెం విజయ్ కుమార్‌కు బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా పదవి దక్కగా, జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ దక్కింది.
వీలైనంత త్వరగా 3వ జాబితా: మరో 2 దశల్లో పూర్తి స్థాయి నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 3వ జాబితాను వీలైనంత త్వరగా విడుదల చేయనుండగా నాలుగో జాబితాకు కాస్త సమయం పడుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రానికి పెనుముప్పుగా మారిన డ్రగ్స్ - అమిత్ షాను ట్యాగ్ చేసిన పవన్ కల్యాణ్