ETV Bharat / state

'జేఎన్​టీయూ వీసీ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తాం'

author img

By

Published : Oct 28, 2020, 10:04 PM IST

అనంతపురం జేఎన్​టీయూ ఉపకులపతి శ్రీనివాస కుమార్ అవినీతి అక్రమాలు వెలుగులోకి తెస్తామని సీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల యజమాని చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో పనిచేసిన సమయంలోనే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

bjp leader chiranjeevi reddy fire on jntu anantapur vc
జేఎన్​టీయూ 'వీసీ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తాం

అనంతపురం జేఎన్​టీయూ ఉపకులపతి శ్రీనివాస్ కుమార్​పై సీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల యజమాని, భాజపా నేత చిరంజీవి రెడ్డి మండిపడ్డారు. కాకినాడలో పనిచేసినప్పుడే అక్రమాలకు పాల్పడ్డారని చిరంజీవి రెడ్డి ఆరోపణ చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 2 పార్టీల నాయకులు తనను బెదిరించారని వీసీ చేసిన ఆరోపణలపై స్పందించారు.

అనంతపురం జేఎన్టీయూలో వంద కోట్ల రూపాయల పనుల్లో పర్సెంటీజీలు పొందారని, సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూకు కోట్ల రూపాయల బకాయి ఉన్న విషయంపై హైకోర్టు స్టే ఉందని చిరంజీవి రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రమాణాల గురించి మాట్లాడే అధికారం ఉపకులపతికి లేదన్నారు. తమను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే అక్రమాలన్నీ వెలికి తీస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

ప్రజాధనంతో రాష్ట్రంలో మత వ్యాప్తి: ప్రధానికి రఘురామ లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.