దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భవ పథకాన్ని ప్రవేశపెట్టారని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాజకీయల్లోకి సేవ చేసేందుకేగాని... సంపాదన కోసం కాదన్నారు. రోగులకు, ప్రజలకు అన్నదానం చేసి స్వయంగా వడ్డించారు. ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి