అనంతపురం జిల్లాలో ధరలు లేక నష్టపోతున్న బత్తాయి రైతుల నుంచి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలిని భాజపా సీనియర్ నేత చిరంజీవి రెడ్డి డిమాండ్ చేశారు. దేశ జీడీపీలోనే కీలక భూమికి పోషిస్తున్న చీని రైతులు... ధరలు లేక అల్లాడిపోతున్నారని అన్నారు.
జిల్లాలో సుమారు 2లక్షల టన్నుల చీని... రైతుల వద్దనే ఉండిపోయిందన్నారు. గతంలో టన్ను ధర రూ.50 వేెల నుంచి 60 వేల పలికిందని.. ఇప్పుడు కనీసం రూ.10వేలు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బత్తాయి పండు రోగ నిరోధక శక్తి పెంచడంలో తోడ్పడుతుంది... అందువల్ల ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. మరోవైపు విద్యుత్ ఛార్జీలు, మద్యం ధరల పెంపుపై ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.