ప్రశాంతి నిలయంలో బిహార్, ఛత్తీస్గడ్ భక్తుల హోలీ వేడుకలు - holi celebrations at puttaparti prashanti nilayam
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బిహార్, ఛత్తీస్గడ్కు చెందిన సత్యసాయి భక్తులు హోలీ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పర్తియాత్ర పేరుతో రెండు రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు పుట్టపర్తి వచ్చారు. హోలీ వేడుకల్లో భాగంగా బిహార్లోని భాగల్పూర్ బాలవికాస్ విద్యార్థులు 'భక్త సక్త భగవాన్' నృత్య నాటికను ప్రదర్శించారు. బాలుని రూపంలో భగవంతుడు ప్రత్యక్షమై... తల్లిదండ్రులను అనుగ్రహించే దైవత్వం యొక్క విశిష్టతను వివరించే సన్నివేశాలను అద్భుతంగా ప్రదర్శించారు. భగవత్ ప్రార్థన యొక్క అనుగ్రహం, దైవం మానష రూపేణా వంటి దివ్యత్వ భావాలను ప్రదర్శించారు. సత్యసాయి భక్తి గీతాలను భక్తులు శ్రావ్యంగా అలపించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఇవాళ జరిగిన వేడుకలతో బిహార్ చత్తీస్గడ్ భక్తుల పర్తియాత్ర ముగిసింది.
నృత్య నాటికను ప్రదర్శిస్తున్న విద్యార్థులు
By
Published : Mar 11, 2020, 3:05 PM IST
..
ప్రశాంతి నిలయంలో బీహార్, ఛత్తీస్గడ్ భక్తుల హోలీ వేడుకలు